Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.
ఒక్కసారిగా కళ్యాణ వేదిక వద్ద తోపులాట జరిగింది. భక్తులు తోసుకుంటూ దూసుకు వచ్చారు. ఆ సమయంలో మంత్రి మొబైల్ ఫోన్ కింద పడింది. గుర్తు తెలియని భక్తుని చేతికి ఆ ఫోన్ దొరికింది. తర్వాత మంత్రి జేబు తడుముకుంటే తన ఫోన్ కనిపించలేదు.
అక్కడే ఉన్న ఎమ్మెల్యే రాజయ్య మంత్రి ఫోన్ పోయిందని, ఎవరికైనా దొరికితే తెచ్చి తీసుకొచ్చి ఇవ్వండి అని మైక్ లో చెప్పారు. ఆతరువాత ఓ భక్తుడు తనకు దొరికిందని ఆఫోన్ ను తీసుకొచ్చి ఇచ్చాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.