EG: కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తుని మండలం ఎన్.ఎస్ వెంకట నగరంకి చెందిన విమల(22) శుక్రవారం ఉదయం నుంచి కనబడటం లేదని ఆమె తండ్రి సింహాచలం ఫిర్యాదు చేశారని తెలిపారు. యువతి ప్రతిరోజు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళుతుందని తండ్రి తెలిపారు అన్నారు.