VKB: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గిరిజనులపై ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకొని వారిని విడుదల చేయాలని మాజీ జెడ్పీటీసీ, గిరిజన సంఘాల నాయకుడు దశరథ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం కడ్తాల్లో మాట్లాడుతూ ఫార్మా పేరుతో అమాయక గిరిజనుల భూములను లాక్కునేందుకు వారిపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయడం అన్యాయం అన్నారు.