TG: రాష్ట్రంలో రైతు ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ డబ్బులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈనెల 11న పైలట్‌గా ఒక రైతు ఖాతాలో క్వింటాకి రూ.500 చొప్పున రూ.30 వేలు జమ చేసింది. ఇవాళ రూ.కోటికిపైగా చెక్కులను పౌరసరఫరాల శాఖ జారీ చేసింది. 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి బోనస్ డబ్బులు జమ కానున్నట్లు అధికారులు వెల్లడించారు.