TG: పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్ష ఫీజును చెల్లించేందుకు గడువును పొడిగించింది. ఈనెల 18తో గడువు ముగియనుండగా నవంబర్ 28 వరకు పెంచింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10, రూ.200 రుసుముతో డిసెంబర్ 19, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 30 వరకు విద్యార్ధులు పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం కల్పించింది. మరిన్ని వివరాల కోసం https://www.bse.telangana.gov.in/ వెబ్సైట్ చూడవచ్చు.