సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఎక్స్-రే యంత్రాలు 6 నెలలుగా పని చేయడం లేదు. ఆసుపత్రిలో మొత్తం 5 యంత్రాలు ఉండగా.. అందులో 4 మూలన పడ్డాయి. మిగిలిన వాటిలో ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. 6 నెలలుగా యంత్రాలు పనిచేయకపోయినా.. పట్టించుకోకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.