మణిపుర్‌లోని జిరిబామ్ జిల్లాలో ఇటీవల మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మహిళ మృతదేహమై తేలింది. అయితే ఆమె పోస్ట్‌మార్టం రిపోర్టులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె థర్డ్ డిగ్రీ వేధింపులకు గురయ్యారని.. శరీరం కూడా 99 శాతం కాలిపోయిందని రిపోర్ట్‌లో తేలింది. ఆమె అనేక శరీర భాగాలు, అవయవాలు కనిపించకుండా పోయినట్లు వైద్యాధికారులు నివేదికలో వెల్లడించారు.