ఇజ్రాయెల్‌తో తమ దేశం అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. సౌదీ అరేబియా, అజర్బైజాన్ పర్యటనల అనంతరం ఎర్డోగాన్ తన విమానంలో ఉన్న పాత్రికేయులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా పాలక కూటమి ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలనే నిర్ణయంలో దృఢంగా ఉంది, భవిష్యత్తులో కూడా మేము ఇదే వైఖరిని కొనసాగిస్తాము’ అని ఎర్డోగాన్ అన్నారు.