AP: బుధవారం క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇంద్రపుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాల కాంతిలో రకరకాల పూలతో హంస నావికా వాహనంలో ఉషా, ఛాయాపద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని అలంకరించారు. 12 సార్లు ఇంద్రపుష్కరిణిలో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.