మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే 20 సార్లు కుప్పకూలిన ‘రాహుల్ బాబా’ విమానం నవంబర్ 20న జరిగే ఎన్నికల్లో మరోసారి కూలడం ఖాయమన్నారు. రాహుల్ బాబా పేరున్న విమానాన్ని 20 సార్లు ల్యాండింగ్ కోసం సోనియా గాంధీ ప్రయత్నించారంటూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 21వ సారి విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.