AP: మాజీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. చట్టసభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు. తాను నవ్వుతూ సమాధానం చెప్పానని జగన్ వక్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం ఆయన నైజమని ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పకుండా బురదజల్లడం ఆ పార్టీ అధినేతకూ, నేతలకు అలవాటేనని సత్యకుమార్ విమర్శించారు.