టీమిండియా యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం. చిన్నప్పటి నుంచి అతని ఆటను చూస్తూ పెరిగాను. అతడు భారత్ క్రికెట్ శైలిని పూర్తిగా మార్చేశాడు’ అని తెలిపాడు. క్రికెట్లో బెన్ స్టోక్స్, కపిల్ దేవ్లా గొప్ప ఆల్రౌండర్ కావడానికి కృషి చేస్తున్నా అని పేర్కొన్నాడు.