వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో పలు సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా రాష్ట్రాలూ తమ సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. NTAలో సంస్కరణలకు సంబంధించి కె.రాధాకృష్ణన్ కమిటీ తన నివేదికను సమర్పించాలని వెల్లడించారు. నెట్, నీట్ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో NTAను సంస్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.