రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తున్నదని నిలదీశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. . ప్రకృతితో పాటు మానవుల రూపంలో వారికి అన్యాయం జరుగుతున్నది. పండించిన పంటను మార్కెట్ కు తీసుకువెళ్లితే ధర వెక్కిరిస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలకు ఈ పరిస్థితి ఎదురవుతున్నది.
ప్రపంచంలో తాము ఉత్పత్తి చేసిన దానికి దాని ధర పెట్టుకోలేని దౌర్భగ్యం ఒక్క రైతుల (Farmer)కే ఉంటుంది. తాము పండించిన ఉత్పత్తికి తాము ధర పెట్టుకోలేని పరిస్థితి. దుక్కి దున్ని సాలు చేసి విత్తు విత్తి పంట పండించే రైతుకు ప్రతి చోట దగా, దోపిడీ ఎదురవుతున్నది. ప్రకృతితో పాటు మానవుల రూపంలో వారికి అన్యాయం జరుగుతున్నది. పండించిన పంటను మార్కెట్ కు తీసుకువెళ్లితే ధర వెక్కిరిస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలకు ఈ పరిస్థితి ఎదురవుతున్నది. ముఖ్యంగా టమాటా (Tomato), ఉల్లిపాయ (Onion) ధరలు (Price) దోబుచులాడుతాయి. ఈ పంటలు పండిస్తున్న రైతులకు మద్దతు ధర లభించడం లేదు. మద్దతు ధర కాదు కదా కనీస ధర కూడా లభించడం లేదు. దీంతో వాళ్లు నట్టేటా మునుగుతున్నారు. తాజాగా ఉల్లి రైతుల పరిస్థితి అలాగే ఉంది. రెండంటే రెండు రూపాయలకు కిలో ధర పడిపోయిన దారుణ పరిస్థితి. ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. వీరి అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. ఉల్లి రైతులను ఆదుకోవాలని ఓ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర (Maharashtra)లో రైతులు ఉల్లిని అధిక మొత్తంలో పండిస్తారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి ధర అమాంతం పడిపోయింది. రెండు రూపాయలకే ధర పడిపోవడం రైతులను కలవర పెడుతోంది. ఈ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై ఎన్ సీపీ (Nationalist Congress Party-NCP) ఎమ్మెల్యేలు (MLAs) వినూత్న రీతిలో నిరసన (Protest) వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) సందర్భంగా ఉల్లిపాయలను ఎమ్మెల్యేలకు తీసుకొచ్చారు. దీంతోపాటు ఉల్లిపాయ దండలు (Onion Garland) వేసుకుని ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉల్లి, వెల్లుల్లికి తగిన ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పంటలకు సరైన ధరలు లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఎదురైందని ఎమ్మెల్యేలు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: బడ్జెట్ పై మేల్కొన్న ఏపీ ప్రభుత్వం.. 14 నుంచి సమావేశాలు
ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులకు కనీసం రవాణా ఖర్చు కూడా దక్కడం లేదని ఎన్సీపీ ఎమ్మెల్యేలు వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రూ.15 నుంచి రూ.20కి ప్రభుత్వమే ఉల్లిపాయను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని ఓ రైతు 512 కిలోల ఉల్లిగడ్డలను 70 కిలో మీటర్లు ప్రయాణించి మార్కెట్లో విక్రయించాడు. అతడికి వచ్చిన డబ్బు రెండు రూపాయలు మాత్రమే. ఇలా ఉల్లి రైతును ధరాఘాతం వెంటాడుతోంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తున్నదని నిలదీశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
కాగా ఉల్లిపాయలకు ధర కల్పించాలని కోరుతూ రైతులు ఉద్యమ బాట పట్టారు. ధర తక్కువగా ఉండడంతో ఒక చోట ఓ రైతు ట్రాక్టర్ తో ఉల్లిపాయలను నడిరోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశాడు. మరో చోట ఓ మహిళా రైతు ఉల్లిపాయలను చెత్తకుప్పపై వేసింది. ఇలా మహారాష్ట్రలో ఉల్లి పాయ రైతులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. తమకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.