BHNG: మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి వేళల్లో కళాశాల ప్రధాన గేట్ వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమలను దుండగులు వదిలి వెళ్లారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనకు గురయ్యారు. కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ, నైట్ వాచ్మెన్ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు.