మైనార్టీలే లక్ష్యంగా మరోసారి బంగ్లాదేశ్లో దాడులు జరిగాయి. క్రిస్టియన్ త్రిపుర కమ్యూనిటీకి చెందిన 19 ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. 17 ఇళ్లు పూర్తిగా కాలిపోగా, రెండు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు బాధితులు తెలిపారు. తమ ఇళ్లను కాల్చిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.