పాకిస్థాన్లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడం లేదని BCCI తేల్చిచెప్పింది. తాజాగా, భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్లో పాల్గొనే పాక్ ఆటగాళ్లకు భారత్ వీసాలు నిరాకరించింది. రెండు నెలల ముందుగానే పాక్ ఆటగాళ్లు వీసా కోసం దరఖాస్తులు సమర్పించారు. అయితే, వారికి వీసాలు జారీ చేసేందుకు భారత్ హైకమిషన్ నిరాకరించింది.