AP: వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేరాలు తగ్గి శాంతి నెలకొనాలంటే మాజీ సీఎం జగన్ని అరెస్టు చేయాలని పేర్కొన్నారు. క్రిమినల్, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని జగన్ బయటపెట్టుకుంటున్నారని అన్నారు. రౌడీలను రెచ్చగొట్టి, పోలీసులను భయపెట్టి రావణకాష్ఠం చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రౌడీ షీటర్లు, హంతకులందరినీ జైళ్లకు పంపిస్తే వైసీపీ దాదాపు ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు.