వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వ్యాపార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. వచ్చే కొద్ది నెలల్లో అందుబాటు ధరల్లో మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. విడా శ్రేణికి సంబంధించి అందుబాటు దరల్లో మోడల్స్‌ను కూడా ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.1-1.5 లక్షల శ్రేణిలో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో కంపెనీ విక్రయిస్తోంది.