డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మీ విజన్‌లో భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని నమ్మారని ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే, కమలా హారిస్‌కు సైతం అభినందనలు తెలిపారు. ఉత్సాహంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఉపాధ్యక్షురాలిగా ప్రజలందరినీ ఏకం చేయాలనే సంకల్పంతో పనిచేశారని ప్రశంసించారు. బైడెన్ పరిపాలనలో ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో భారత్, అమెరికా సహకారం మెరుగైందని పేర్కొన్నారు.