వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు BCCI నిరాకరిస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ల నిర్వహణ విధానంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గింది. టీమిండియా ఆడే మ్యాచులకు సంబంధించి సర్దుబాట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ తన మ్యాచ్లను దుబాయ్ లేదా షార్జాలో ఆడే అవకాశముందని ఓ పీసీబీ అధికారి తెలిపారు.