బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ను చంపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సందేశం వచ్చింది. దీంతో వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య జరిగినప్పటి నుంచి సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే.