ఏ సీజన్ అయినా సరే రోజూ తగినన్ని నీళ్లను తాగితేనే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే.. డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల జీవ క్రియలపై ప్రభావం పడుతుంది. దీంతో కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. చర్మం పొడిబారుతుంది. తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. చిన్న పని చేసినా తీవ్రంగా అలసిపోతారు. డీహైడ్రేషన్ బారిన పడ్డారంటే మూత్రం రంగులోనూ మార్పు వస్తుంది.