NLR: చిట్టమూరు మండలం, ఆరూరు గ్రామంలో గురువారం ఉపాధి పథకంలో జరిగిన అవకతవకలపై ఎంపీడీవో మనోహర్ గౌడ్ విచారణ చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరూరు గ్రామానికి చెందిన కొంతమంది గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేశారు. దీనితో ఉపాధి కూలీలను పిలిపించి విచారణ చేపట్టారు.