AP: ఏపీ టూరిజం శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో రోజా భారీ అవినీతికి పాల్పడ్డారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. టూరిజం శాఖలో రూ. 400 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల శ్రీవారి పేరు చెప్పి టూరిజం శాఖలో ప్రతి రోజు రూ. లక్ష కొట్టేశారని పేర్కొన్నారు. స్కామ్‌పై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేశ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మొత్తం ఆధారాలతో సీఐడీకి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు.