AP: ఇటీవల హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీకి చెందిన నేతలు రకరకాల కామెంట్స్ చేశారు. వీటన్నింటికి తాజాగా పవన్, అనిత చెక్ పెట్టారు. ఇరువురు భేటీ అయి రాష్ట్ర పరిస్థితులపై చర్చించుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాఫ్ పడినట్లుగానే అందరూ భావిస్తున్నారు.