నచ్చిన హీరోలంతా ఒకే ప్రేమ్‌లో ఉంటే ఫ్యాన్స్‌కు పండుగే. అలాంటి సర్ ప్రైజ్‌ని మన బడా హీరోలు అభిమానులకు అందించారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరు, ముగ్గురు హీరోలుంటే అక్కినేని, నందమూరి, మెగా ఫ్యామిలీస్ నుంచి ఆ సంఖ్య భారీగానే ఉంది. అయితే ఇప్పుడు నాగార్జున, చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, అఖిల్, తదితరులు ఒకే ప్రేమ్‌లో ఉండడం ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తోంది. కాగా, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.