ADB: తాంసి మత్తడి వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 40 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు JE హరీశ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 అడుగులు కాగా, ప్రస్తుతం 274.30 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 40 క్యూసెక్కులుగా ఉందన్నారు.