సాయి లైఫ్‌సైన్సెస్ కంపెనీ IPOకి సెబీ నుంచి అనుమతి లభించింది. ఈ IPO ద్వారా కొత్తగా రూ.800 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు రూ.6.15 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. దీని ద్వారా వచ్చే నిధుల్లో దాదాపు రూ.600 కోట్లను అప్పు చెల్లించడానికి కంపెనీ కేటాయించనుంది. రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్టైల్స్, మెటల్ మ్యాన్ ఆటో కంపెనీల IPOకి కూడా సెబీ అనుమతిచ్చింది.