GNTR: సోషల్ మీడియా వేదికగా వ్యక్తుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గుంటూరు వెస్ట్ SDPO జయరాం ప్రసాద్ హెచ్చరించారు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వెంకటరామిరెడ్డిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. అతణ్ని కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.