SKLM: నరసన్నపేట పట్టణంలోని నూతన బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాంకు సిబ్బందితో మాట్లాడుతూ.. ఖాతాదారులకు విశిష్ట సేవలను అందించాలని అన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బందితో పలు విషయాలను ఎమ్మెల్యే చర్చించారు. ఈ ఎమ్మెల్యే తో పాటు మాజీ వ్యవసాయ సంఘ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.