»Traffic Constable Saves A Life With Cpr In Rtc Bus Stop
Hyderabad: బస్టాప్ లో CPRతో నిండు ప్రాణం కాపాడిన కానిస్టేబుల్.. శభాష్
సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసులు కూడా అభినందించారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని సీఐ తెలిపారు.
మానవ శరీరం (Human Body)లో ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు. ఉన్నట్టుండి మనుషులు స్పృహ తప్పిపోతున్నారు. అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు చూస్తూ చూస్తుండగానే హఠాన్మరణం పొందారు. తాజాగా ఓ బస్టాప్ (Bus Stop)లో ఓ యువకుడు కుప్పకూలగా సమయస్ఫూర్తితో కానిస్టేబుల్ (Constable) వ్యవహరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) ద్వారా వ్యక్తి ప్రాణాలు నింపిన కానిస్టేబుల్ ను అందరూ అభినందిస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే యువకుడు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) బస్సు కోసం వేచి చూస్తున్నాడు. చూస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా కింద పడిపోయాడు. అక్కడే ట్రాఫిక్ విధులు (Traffic) నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ అక్కడికి చేరుకున్నాడు. బాలరాజు పరిస్థితి చూసి వెంటనే ఎదపై బలంగా బాదడం మొదలుపెట్టాడు. ఊపిరి పీల్చుకునే విధంగా పలుమార్లు రెండు చేతులతో గట్టిగా నొక్కడంతో బాధితుడికి స్పృహ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారు కానిస్టేబుల్ ను అభినందించారు. ఆ వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ చేసిన విధానాన్ని వైద్య పరిభాషలో సీపీఆర్ (CPR) అంటారు. కాగా ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని ట్రాఫిక్ సీఐ శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసులు కూడా అభినందించారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని సీఐ తెలిపారు. అతడిని కాపాడిన కానిస్టేబుల్ ను తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా అభినందించారు.
Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents pic.twitter.com/BtPv8tt4ko