SKLM: పొందూరులో మంగళవారం చేనేత పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పొందూరు మండల టీడీపీ అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహన్ రావు సోమవారం తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రా వారి ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.