KNR: రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌కు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్ కె.సి.రావు తెలిపారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో అండర్-17 రాష్ట్ర టోర్నమెంట్ జరగనున్నట్లు వివరించారు. కరీంనగర్ జిల్లా టీం తరఫున సైనిక్ విద్యార్థులు V. మనోజ్, ఎన్. భరత్, R. భరత్, టి. గౌతమ్, K. తేజ, R. హృతిక్ పాల్గొంటారని తెలిపారు.