భారత్లో నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. FMCG కంపెనీలు మరోసారి బిస్కెట్లు, నూనె, షాంపులు, సబ్బులు వంటి ధరలను పెంచేందుకు రెడీ అయ్యాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీల లాభాలు తగ్గాయి. దీంతో పాటు పామాయిల్, కాఫీ వంటి ధరలు పెరగడంతో తమ ప్రొడక్ట్స్ రేట్లు త్వరలోనే పెంచుతామని కొన్ని FMCG సంస్థలు పేర్కొన్నాయి. ఉత్పత్తుల ధరలను పెంచి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా లాభాలను పెంచుకుంటామని తెలిపాయి.