కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సంజయ్ రాయ్ స్టేట్మెంట్ను కోర్టులో రికార్డు చేశారు. ఈ క్రమంలోనే తొలిసారి నిందితుడు కెమెరా ముందు నోరు విప్పాడు. సీఎం మమత ప్రభుత్వం తనను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు ఆరోపించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.