NZతో జరిగిన మూడో టెస్టులో పంత్ ఔట్ నిర్ణయంపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ‘X’ వేదికగా స్పందించాడు. ‘ఒక పెద్ద మ్యాచ్‌లో కీలక సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ బ్యాట్‌కి బంతి తగిలిందా లేదా అనేది ఆందోళనగా ఉంది. అసలు ఈ సమయంలో హాట్ స్పాట్ ఉండాలి. థర్డ్ అంపైర్ స్పష్టంగా చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడా అనే విషయం నాకు తెలీదు. సాంకేతికను ఉపయోగించుకుని మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నాడు.