ప్రకాశం: అద్దంకి పట్టణంలో రంగారావు హాస్పిటల్ నందు రెండో అంతస్థు నుండి ప్రమాదవశాత్తు పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కింద పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో మరమ్మత్తుల నిమిత్తం కూలి పనికి వెళ్లిన పవన్ కుమార్ రెడ్డి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఖాదర్ భాషా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.