రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలతో అలరించారు. వీటిలో ఆచార్య.. చిరు కెరీర్లోనే దారుణమైన పరాజయాన్ని అందుకోగా.. వాల్తేరు వీరయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ‘భోళా శంకర్’ రాబోతోంది. ఇది మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. వచ్చే దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే వెంకీ కుడుముల చాలా కాలంగా చిరు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా మెగాస్టార్ కోసం కథ రెడీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వి.వి.వినాయక్ కూడా లైన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. వినాయక్, మెగాస్టార్‌ది హిట్ కాంబినేషన్. వీళ్ల కాంబోలో వచ్చిన ఠాగూర్, ఖైదీ నెం.150 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఖైదీ నెం.150 తర్వాత వినాయక్ సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఇంటిలిజెంట్ అనే సినిమాతో దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయారు. ప్రస్తుతం హిందీలో ఛత్రపతి రీమేక్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక్ కథ కోసం కసరత్తులు చేస్తున్నాడట. అన్ని కుదిరితే.. చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ వినాయక్‌తోనే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ హ్యాట్రిక్ కాంబో.. ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి.