ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్(63) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బాల్ మరణవార్తను ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) ధ్రువీకరించింది. FDCI వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఆయన ఫ్యాషన్ రంగంలో చేసిన విశేష కృషిని గుర్తు చేసుకుంది. ఫ్యాషన్ రంగంలో బాల్ తనదైన ముద్ర వేసి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.