AP: కోనసీమ జిల్లాలో దళిత వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్, రెండవ నిందితుడు ధర్మేశ్లకు కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను అమలాపురం కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు వారికి మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.