యూపీలోని అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. రామమందిరానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నిర్వహిస్తున్న తొలి దీపావళి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీపాలతోపాటు లేజర్ షో నిర్వహించారు. అలాగే, రామాయణ నాటకం ప్రదర్శించారు. డ్రోన్స్‌తో రామాయణంలోని ముఖ్య ఘట్టాలను షో చేశారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియాకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.