భారత్-చైనా సరిహద్దు తూర్పు లద్దాఖ్‌లో బలగాలను ఉపసంహరించుకోవడంపై భారత్‌లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ స్పందించారు. ‘భవిష్యత్‌లో ఇరుదేశాల సంబంధాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఇరుపక్షాల మధ్య నిర్ధిష్టమైన విబేధాలు వీటికి అంతరాయం కలిగించవు. అయితే, బేధాభిప్రాయాలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేదే ఇప్పుడు ముఖ్యమైన అంశం’ అని షు పేర్కొన్నారు.