»Teen Dragged By Hair After Being Stabbed By Man She Rejected
Crime : తనతో పెళ్లికి ఒప్పుకోలేదని..కత్తిమెడపై పెట్టి.. జట్టు లాగి….!
Crime : తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ 47ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. ఆమె అంగీకరించలేదని.. మెడపై కత్తి పెట్టి... జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ 47ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. ఆమె అంగీకరించలేదని.. మెడపై కత్తి పెట్టి… జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… రాయ్‌పూర్‌లోని గుధియారీ ప్రాంతంలో ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ (47) అనే వ్యక్తి ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణంలో కొన్నాళ్లుగా బాధిత బాలిక (16) పని చేస్తోంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై మనోజ్ ఒత్తిడి చేయగా.. అందుకు బాలిక, ఆమె తల్లి నిరాకరించారు. వెంటనే బాలిక అతడి దుకాణంలో పని మానేసింది. దీంతో బాలికపై కోపం పెంచుకున్న నిందితుడు.. అదును చూసి దాడికి పాల్పడ్డాడు. ఆమెను ఆయుధంతో గాయపరిచి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు.
ఈ దృశ్యాన్ని కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఒంటిపై పలు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు