Kanthara -2 : ‘కాంతార 2’లో రజనీ కాంత్.. ఇక బాక్సాఫీస్ బద్దలే!?
Kanthara -2 : కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నటించాడు. ఊహించని విధంగా కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది.
కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నటించాడు. ఊహించని విధంగా కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. దాంతో కాంతార 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీక్వెల్ ఉంటుందని రిషబ్ శెట్టి అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా ప్రీక్వెల్‌లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని చెప్పాడు. హోంబలే ఫిల్మ్స్ కూడా పెరిగిన అంచనాలకు తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ సినిమాలో సూపర్ స్టార్‌ను ఇన్వాల్వ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాంతార సినిమా చూసిన రజనీకాంత్.. ఆ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపంచారు. ఆ తర్వాత రిషబ్ శెట్టిని ఇంటికి పిలిపించి.. ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా కాంతార 2లో రజనీకాంత్ ఉంటారా.. అనే ప్రశ్న ఎదురైంది రిషబ్ శెట్టికి. కానీ దీనికి రిషబ్ ఆన్సర్ చేయలేదు. యస్ అని చెప్పలేదు.. నో అని చెప్పలేదు. దాంతో సూపర్ స్టార్ కాంతార 2లో నటించబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఒకవేళ నిజంగానే రజనీ కాంత్ కాంతార 2లో నటిస్తే.. సినిమా పై మరింత వెయిట్ పెరిగినట్టే. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోతాయి. మరి రిషబ్ శెట్టి ఈ సారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.