SRD: కంది మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం కులగణన, కుటుంబ సర్వేపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో యాదగిరి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 6 నుంచి 18 వరకు కులగణన, కుటుంబ సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ ఖమ్రుద్దీన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.