ప్రకాశం: కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం మరియు కంచరగుంట గ్రామంలో మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు, ఆయన మాట్లాడుతూ.. శనగ వేయు రైతులు సిఫారసు చేసిన ఎరువులు చివరి దుక్కిలో యూరియా 20కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 125కేజీలు ఒక ఎకరం చొప్పున భూమిలో వేసుకోవాలని తెలిపారు.