TG: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.