TG: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైన పరిపాలన సాగిస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, వసూళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, అదే సమయంలో అడ్మినిస్ట్రేషన్ మాత్రం సరిగ్గా కొనసాగడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని అంశాలు అవినీతిమయమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టులు, కమిషన్ల దందా సాగుతోందని విమర్శించారు.