AP: గ్రూప్-2 అభ్యర్థులకు APPSC గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు చేసింది. ఈ మేరకు వచ్చే సంవత్సరం జనవరి 5న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. డీఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.